ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా నాగుల చవితి వేడుకలు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు14 నవంబర్, 202604:19 AM

    నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయంలో శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నాగదేవతకు పూజలు చేశారు.

    మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా నాగుల చవితి వేడుకలు
    స్టేషన్ ఘనపూర్ నవంబర్ 14 ప్రజాధ్వని : నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయంలో శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నాగదేవతకు పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు రామలింగయ్య శర్మ, శ్రీనివాస్ శర్మ, ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళావతి, కొలిపాక సునీత–సతీష్ దంపతులు, గట్టు రజిత–కుమార్, రాజేష్, ప్రవళిక, స్వప్న, సుగుణ, జ్యోతి, అనూష, సరస్వతి, నాగరాజు, కట్కూరి మహేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: