సమాచార హక్కు పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా జావీద్ పాషా
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 జులై, 202606:35 AM

జనగామ జులై 04 ప్రజాధ్వని : సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ జావీద్ పాషాను రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేష్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే కీలక చట్టమని పేర్కొన్నారు. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించి, వారి హక్కుల పరిరక్షణ కోసం సమర్థంగా పనిచేసే నాయకత్వం అవసరమని, ఆ నమ్మకంతోనే జావీద్ పాషాను జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ పాషా మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించేలా కృషి చేస్తానని చెప్పారు. సంస్థ బలోపేతానికి నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాటా కుమారస్వామి, జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ దాస్ ఉపేందర్, ప్రధాన కార్యదర్శి బైరి భరత్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జావీద్ పాషా నియామకంపై కమిటీ నాయకులు, సభ్యులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగి, ప్రజా సమస్యల పరిష్కారంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
