ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    పట్టభద్రుల ఓట్లు కాంగ్రెస్‌కే: కొలిపాక సతీష్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు27 అక్టోబర్, 202604:12 AM

    వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వోత్తం రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలిపాక సతీష్‌ కోరారు.

    పట్టభద్రుల ఓట్లు కాంగ్రెస్‌కే: కొలిపాక సతీష్
    స్టేషన్ ఘన్‌పూర్ అక్టోబర్ 27 ప్రజాధ్వని: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వోత్తం రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలిపాక సతీష్‌ కోరారు. డిగ్రీ అర్హత కలిగిన వారంతా పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సర్వోత్తం రెడ్డి ఉన్నత విద్యావంతుడని, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి అని సతీష్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. పట్టభద్రులు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడ్ల శ్రీనివాస్, గట్టు రంజిత్, గట్టు కోటేశ్వర్, నక్క పాపయ్య, గట్టు సురేందర్‌గౌడ్, ఏలియా, కృష్ణ గట్టు, శివ, తాళ్లపల్లి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: