రాజయ్యకు కళ్లు మూసుకుపోయాయా? - కనకం రమేష్ ఫైర్
- కడియం అంటే బ్రాండ్, కమిట్మెంట్ - మా నాయకుడి జోలికొస్తే తరిమికొడతాం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు20 సెప్టెంబర్, 202602:53 PM

స్టేషన్ ఘన్పూర్ 20 సెప్టెంబర్ ప్రజాధ్వని : స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ కనకం రమేష్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దానం నాగేందర్ పై వేటుతో ఒక్క వికెట్ పడింది, తర్వాత కడియం అంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. "ఇదేమీ క్రికెట్ ఆట కాదు. ఇంకోసారి కడియం ను విమర్శిస్తే ఖబడ్దార్" అంటూ హెచ్చరించారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తుంటే రాజయ్య కళ్లు ఉండి చూడలేకపోతున్నాడా? అని ప్రశ్నించారు. ఎంపీ కడియం కావ్య పార్లమెంట్ లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, ఆడబిడ్డపై మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? అంటూ నిలదీశారు. దళిత స్పీకర్ ను అసెంబ్లీలో అవమానిస్తే కనీసం దళితుడిగా స్పందించకుండా మౌనంగా ఉండి, దళితుడివి అని చెప్పుకోవడం దొంగ ప్రేమ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ వయసులో కూడా విద్య, వైద్య సేవల కోసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి తపన పడుతుంటే విమర్శలు చేయడం తగదు. భ్రమలో నుండి బయటకు వచ్చి చూడు, అభివృద్ధి కనబడుతుంది. మా నాయకుడిని పల్లెత్తు మాట అంటే తరిమికొడతాం. ప్రజలు రాజయ్యను ఎప్పుడో ఛీదరించుకున్నారు. నీ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు, తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు, బిడ్డా జాగ్రత్త" అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుందూరు వెంకట్ రెడ్డి, సింగాపురం వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ సింగపురం దయాకర్,గుర్రం ఫాతి కుమార్, ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాస్కుల ఎల్లయ్య, తోకల సమ్మయ్య, బాస్కుల కుమార్, రమణాచారి, తాటికొండ(సున్నం) యాదగిరి, 13 వ వార్డు అధ్యక్షుడు గద్దల యాదగిరి,చేపూరి కొమురయ్య, రాజేష్, సోన్నాయిల శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
