ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    తిరుమలాయపల్లిలో ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 నవంబర్, 202603:43 PM

    రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వశపాక ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్‌ పార్టీ…

    తిరుమలాయపల్లిలో ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
    రాయపర్తి, నవంబర్ 8 (ప్రజాధ్వని):రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వశపాక ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ముద్రబోయిన వెంకటేశ్వర్లు కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు మరిన్ని సేవలందించాలని, రాష్ట్ర అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్‌ నాయకులు గుడి రామచంద్రారెడ్డి, శీలా మధుసూదన్‌రెడ్డి, మచ్చ కుమారస్వామి, గ్రామ యూత్‌ అధ్యక్షుడు భాషబోయిన నాగరాజు, వార్డు సభ్యులు పారుపల్లి సునీత, మధుసూదన్‌రెడ్డి, భాషబోయిన ఎల్లయ్య, వశపాక స్వరూప, నరసయ్య, బరిగల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: