ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    బీజేపీ నేతల అరెస్టులు, హిందువులపై దాడులపై నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు24 ఫిబ్రవరి, 202610:39 AM
    బీజేపీ నేతల అరెస్టులు, హిందువులపై దాడులపై నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు
    స్టేషన్ ఘనపూర్, ఫిబ్రవరి 24 ప్రజాధ్వని: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ ప్రజాప్రతినిధులపై దాడులు, హిందువులపై జరుగుతున్న అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటే ఉపేందర్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎమ్మార్యోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి లో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. అలాగే బాన్సువాడలో ఓ హిందూ మహిళపై మతోన్మాదులు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ, హిందూ సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిదర్శనమని విమర్శించారు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేసి, అసలైన నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు బాల్నే శ్రీనివాస్, జిల్లా మీడియా కన్వీనర్ కె. రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, మండల నాయకులు కన్నెబోయిన రవి యాదవ్, దామెర ప్రశాంత్ చింటూ, వెలిశాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: