ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    తొమ్మిది రోజుల సంబరాలకు ముగింపు.. ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202605:28 AM
    తొమ్మిది రోజుల సంబరాలకు ముగింపు.. ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం
    ఇనుగుర్తి, అక్టోబర్ 10, ప్రజాధ్వని: మహిళల ఆటపాటలు, జానపద గీతాలు, కోలాటాల నడుమ తొమ్మిది రోజులుగా కొనసాగిన బొడ్డెమ్మ సంబరాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని బోయిని బజార్‌లో ఏర్పాటు చేసిన బొడ్డెమ్మకు మహిళలు ప్రతిరోజూ సాయంత్రం పూజలు నిర్వహించారు. సంప్రదాయ పాటలు పాడుతూ, బొడ్డెమ్మ చుట్టూ కోలాటాలు ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పసుపు, కుంకుమ, ఓడి బియ్యం, రవిక, పండ్లతో పాటు ఇతర పూజా సామగ్రిని సమర్పించి సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు. మహిళలు వీడ్కోలు పాటలు పాడుతూ బొడ్డెమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి మండల కేంద్రం సమీపంలోని నీటి వనరులో నిమజ్జనం చేశారు. దీంతో తొమ్మిది రోజుల బొడ్డెమ్మ వేడుకలకు తెరపడింది. ఈ కార్యక్రమంలో లింగాల మహేంద్ర, యాదమ్మ, మామిడాల సుభద్ర, జయలక్ష్మి, శ్రీరామ్ జయలక్ష్మి, కొత్తూరు విజయ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: