డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినికి రూ.1.42 కోట్ల టోకరా
- మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామంటూ బెదిరింపులు..
- ముంబై సైబర్ పోలీసులమంటూ వీడియో కాల్స్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు16 నవంబర్, 202607:52 AM
హైదరాబాద్, నవంబర్ 16: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.1.42 కోట్లు కాజేశారు.

హైదరాబాద్, నవంబర్ 16: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.1.42 కోట్లు కాజేశారు. మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామని బెదిరిస్తూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ వీడియో కాల్స్ చేసి బాధితురాలిని తమ వలలో చిక్కించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సైబర్ నేరగాళ్లు బాధితురాలికి పలుమార్లు వీడియో కాల్స్ చేశారు. తాము ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని పరిచయం చేసుకుని, ఆమె మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారని, విచారణకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ నమ్మించి, వారి సూచనల ప్రకారం వివిధ విడతల్లో నగదు బదిలీ చేయించుకున్నారు. ఈ క్రమంలో బాధితురాలు మొత్తం రూ.1,42,01,359 నగదును సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ఘటన సైబర్ నేరాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
