రాఘవాపూర్‌లో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు15 ఏప్రిల్, 202602:53 AM

స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 14 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గుర్రపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా సింగపురం రామస్వామి, సింగపూర్ సురేందర్, సింగపూర్ ఉదయ్ కుమార్, గాదెపాక కుమార్, ఎడవెల్లి అశోక్, ఎడవెల్లి ఐలయ్య, సింగపురం జగన్, గుర్రం యాదగిరి తదితరులు కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామ సర్పంచ్ మెరుగు క్రాంతి, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజిక సమానత్వం, న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అంతటా అంబేద్కర్ జయంతి వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.
