ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    తెలంగాణ జోలికొస్తే తన్ని తరిమేస్తాం: తోట సురేందర్

    • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆగ్రహం
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు1 జూన్, 202603:58 PM
    తెలంగాణ జోలికొస్తే తన్ని తరిమేస్తాం: తోట సురేందర్
    స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 1: తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని బీఆర్ఎస్ నాయకుడు, స్టేషన్ ఘన్‌పూర్ మండల కన్వీనర్ తోట సురేందర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో నిర్వహించనున్న నవనిర్మాణ సభలపై స్పందిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఒకసారి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్లీ తెలంగాణ జోలికొస్తే తన్ని తరిమేస్తాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే పొలిమేర దాటే వరకు తరిమికొడతాం" అని సురేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టాల్సింది పోయి తెలంగాణలో రాజకీయ మనుగడ కోసం పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యం కోసం అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీ-టీమ్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన సురేందర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు. ఓటుకు నోటు కేసు సందర్భంగా చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను వీడిన విషయాన్ని గుర్తు చేశారు. "ముందు మీ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కృషి చేయండి. తర్వాత తెలంగాణలో సభలు పెట్టండి" అంటూ పవన్ కల్యాణ్‌కు సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎవరూ దెబ్బతీయలేరని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజలు రాజీపడరని స్పష్టం చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: