ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    దిగ్వల్‌లో అరుదైన ఘటన.. ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు24 సెప్టెంబర్, 202608:26 AM
    దిగ్వల్‌లో అరుదైన ఘటన.. ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు
    కోహిర్‌ సెప్టెంబర్ 24 ప్రజాధ్వని: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గం కోహిర్‌ మండలం దిగ్వల్‌ గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు డప్పు ఏసయ్యకు చెందిన ఆవు ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చింది. ఆవు రెండు దూడలకు జన్మనివ్వడంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. విషయం గ్రామంలో తెలియడంతో స్థానికులు ఆసక్తిగా ఏసయ్య ఇంటికి చేరుకుని ఆవుతో పాటు రెండు దూడలను చూసి ముచ్చటించారు. ప్రస్తుతం ఆవు, రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని రైతు ఏసయ్య తెలిపారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: