CPGET దరఖాస్తు గడువు పొడిగించాలని వినతి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు10 జూన్, 202612:58 PM

హన్మకొండ, జూన్ 10 ప్రజాధ్వని : తెలంగాణ రాష్ట్ర (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్) సిపిగెట్-2026 ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించాలని కోరుతూ స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ, దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో పలువురు పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు గడువును తక్షణమే పొడిగించాలని కోరారు.
