గణపతి నవరాత్రుల్లో అన్నదానం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు22 సెప్టెంబర్, 202609:25 AM

రాయపర్తి, సెప్టెంబరు 22 ప్రజాధ్వని: గణపతి నవరాత్రుల సందర్భంగా తిరుమలాయపల్లి గ్రామంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు హనుమాన్ వీధిలోని హనుమాన్ ఆలయ ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్థులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
