చలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉపసర్పంచ్‌ల ముందస్తు అరెస్టు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు8 సెప్టెంబర్, 202607:19 AM

జాఫర్గడ్, సెప్టెంబర్ 8 (ప్రజాధ్వని): ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దుకు సంబంధించిన వార్తల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించనున్న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న నాయకులను జఫర్గడ్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా ఉపసర్పంచ్‌ల కోరమ్ కార్యదర్శి కోత్వాల కుమార్, తమ్మడపల్లి (జీ) ఉపసర్పంచ్ ముక్కెర రాజు, హిమ్మత్‌నగర్ ఉపసర్పంచ్ ఇంతల రాజులను జఫర్గడ్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు సమాచారం. ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దుపై వస్తున్న వార్తలు అవాస్తవమని, ఉపసర్పంచ్‌ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. అయితే, చలో అసెంబ్లీ కార్యక్రమానికి ముందే నాయకులను అదుపులోకి తీసుకోవడంపై ఉపసర్పంచ్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
