ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా_మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

    • పెద్దమడూరులో పలు బాధిత కుటుంబాలకు పరామర్శ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు23 సెప్టెంబర్, 202607:44 AM
    కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా_మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
    దేవరుప్పుల సెప్టెంబర్ 23 ప్రజాధ్వని: బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బుధవారం దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో ఇటీవల మృతిచెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు గనుపాక శ్రీనివాస్‌, పానుగంటి సాయిలు, గోడిశాల సుశీల, గనుపాక ఐలమ్మ కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. అనంతరం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శ్యామల సుధాకర్‌రెడ్డి, దుబ్బ రాజశేఖర్‌, రేగుల స్వామిదాస్‌, రుద్రోజు యాదగిరి, నాగిళ్ల జాశివలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
    కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా_మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు - అదనపు చిత్రం 1
    ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కార్యకర్తలు, వారి కుటుంబాలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, కష్టకాలంలో తాను అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్‌, మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేష్‌, ఏల సోమసుందర్‌, చింత రవి, నల్ల ఉమేష్‌, దిగోజు కిషోర్‌కుమార్‌, మండల యువజన అధ్యక్షుడు బానోత్‌ నవీన్‌నాయక్‌, గ్రామ సర్పంచ్‌ పానుగంటి గిరిబాబు, గ్రామ అధ్యక్షుడు రాములు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: