బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ముక్కెర రమేష్ యాదవ్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 ఆగస్టు, 202612:19 PM

చిల్పూర్ ఆగష్టు 23 ప్రజాధ్వని : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జనగామ జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన ముక్కెర రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా కమిటీలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడా రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ రవిగౌడ్, చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులకు, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఓబీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
