ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ప్రతి కుటుంబం ఉచిత బీమా పొందాలి_కౌన్సిలర్ తాటికొండ మధు

    • అర్హులందరూ ఇందిరా కుటుంబ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు20 నవంబర్, 202608:53 AM

    పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ తాటికొండ మధు పిలుపునిచ్చారు.

    ప్రతి కుటుంబం ఉచిత బీమా పొందాలి_కౌన్సిలర్ తాటికొండ మధు
    స్టేషన్ ఘన్‌పూర్ నవంబర్ 20 ప్రజాధ్వని: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ తాటికొండ మధు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో అర్హులైన కుటుంబాలకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తూ, బీమా సౌకర్యం అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరేదైనా ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా బీమా పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ బీమా ప్రయోజనం అందించాలనే సంకల్పంతో వార్డులో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బీమా భద్రత పొందాలని కౌన్సిలర్ తాటికొండ మధు కోరారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: