కార్మికులకు సంక్షేమ పథకాల కోసం ఐక్యంగా పోరాడాలి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 ఏప్రిల్, 202609:16 AM
సమావేశంలో మాట్లాడుతున్నా బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర కోశాధికారి తాటికొండ మధు

స్టేషన్ ఘనపూర్ ప్రజాధ్వని: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీఎన్ఆర్కేఎస్ (భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం) కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి తాటికొండ మధు హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన కార్మికులు అందరూ మీసేవ ద్వారా తమ లేబర్ కార్డులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కార్మికులంతా ఐకమత్యంతో ఉండి సంక్షేమ పథకాల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా భవన కార్మికులకు లక్ష బైకులు ఇస్తామని తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికులకు 10 లక్షల బైకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న ఆదేశాల మేరకు ఏప్రిల్ 7, 2026న హైదరాబాద్లోని భారత్ నగర్ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింత శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొన్నకంటి బాబు, మండల ఉపాధ్యక్షులు కలకోల ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి బట్టు ఏలియా, గ్రామ ఉపాధ్యక్షులు గోనెల రాజు, సాగ వీరయ్య, గ్రామ నాయకులు మేడ వెంకటస్వామి, సింగపురం చంద్రమౌళి, గుర్రం కుమార్, ఇచ్చుకోటి అంజి, సింగపురం చంద్రయ్య, దేవరాజ్, యాదగిరి, రవి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
