ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఉచిత కుటుంబ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి_కౌన్సిలర్ సంపత్ రాజ్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు20 నవంబర్, 202609:14 AM

    స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంపత్ రాజ్ మాట్లాడుతూ..

    ఉచిత కుటుంబ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి_కౌన్సిలర్ సంపత్ రాజ్
    స్టేషన్ ఘన్‌పూర్ నవంబర్ 20 ప్రజాధ్వని: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంపత్ రాజ్ మాట్లాడుతూ.. కుటుంబ పెద్దకు అనుకోని సంఘటన ఎదురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వార్డులోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన కుటుంబాలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: