తిడుగు గ్రామంలో ఉచిత మెగా కంటి శిబిరం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 ఏప్రిల్, 202609:41 AM

జఫర్గాడ్ ఏప్రిల్ 06 ప్రజాధ్వని: జనగామ జిల్లా జఫర్గాడ్ మండలం తిడుగు గ్రామంలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నవచేతన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, శరత్ మాక్స్ విజన్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గోపు సోమయ్య హాజరై కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్యులు గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాదారపు విజయ్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కలకోటి ప్రసన్న కుమార్, నవచేతన్ సంస్థ ప్రతినిధులు చెన్నమల్ల నాగరాజు, గడ్డం రాజ్ కుమార్, వైద్య బృందం సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

