సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు16 సెప్టెంబర్, 202601:53 PM

చిల్పూర్, సెప్టెంబర్ 16 (ప్రజాధ్వని): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చిల్పూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు, జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటె ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించగా, తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొందిందని తెలిపారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత చరిత్ర, పోరాటాలను ప్రజలకు మరింతగా తెలియజేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్‌కుమార్, జిల్లా మీడియా కన్వీనర్ కాదుగయా రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముక్కెర రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, మండల నాయకులు కన్నెబోయిన అశోక్ యాదవ్, కట్ల అనిల్‌కుమార్, బోసు నాయక్, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
