రఘునాథపల్లి ఎస్‌ఐగా ఎం. భరత్ బాధ్యతల స్వీకరణ
- శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: ఎస్‌ఐ భరత్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు12 అక్టోబర్, 202611:16 AM

రఘునాథపల్లి, ప్రజాధ్వని: రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎం. భరత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్‌ఐగా విధులు నిర్వహించిన నరేష్ యాదవ్ వేలేరుకు బదిలీ కాగా, జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న భరత్ బదిలీపై రఘునాథపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ భరత్ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతో మండలంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఎస్‌ఐ భరత్ పేర్కొన్నారు.
