ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మీదికొండలో భక్తి పారవశ్యం

    • విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణ’ నాటకానికి అశేష జనాదరణ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 సెప్టెంబర్, 202607:57 AM
    మీదికొండలో భక్తి పారవశ్యం
    స్టేషన్‌ఘన్‌పూర్‌ సెప్టెంబర్ 22 ప్రజాధ్వని : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మీదికొండలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. గ్రామంలోని బొడ్రాయి కాలనీ వినాయకుడి వద్ద శ్రీ వేణుగోపాల స్వామి కళానాట్యమండలి ఆధ్వర్యంలో ‘విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణ’ ఆధ్యాత్మిక నాటకాన్ని ఘనంగా ప్రదర్శించారు. నాటకాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళాకారుల అభినయం, సంభాషణలు, ఆహార్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడి తాటక సంహారం, విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణ ఘట్టాలను కళాకారులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించడంతో ప్రేక్షకులు విశేషంగా స్పందించారు. నాటకంలో విశ్వామిత్రుడిగా పన్నీరు రాజు (ఉపాధ్యాయుడు, విశిష్ట ప్రతిభా పురస్కార గ్రహీత), దశరథ మహారాజుగా సాతు సోమయ్య (సీనియర్‌ కళాకారుడు), శ్రీరాముడిగా మల్లం రవీందర్‌గౌడ్‌ (కృష్ణాజిగూడెం సర్పంచ్‌, సీనియర్‌ కళాకారుడు), లక్ష్మణుడిగా చెరుకు పాపయ్యగౌడ్‌ (శ్రీ వేణుగోపాల స్వామి నాట్య కళామండలి అధ్యక్షుడు) నటించారు. గ్రామ పెద్దలు, యువత సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: