ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మహిళల కుంకుమార్చనతో మార్మోగిన గణనాథుని మండపం

    • కురుమ యువత ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202601:06 PM
    మహిళల కుంకుమార్చనతో మార్మోగిన గణనాథుని మండపం
    స్టేషన్ ఘనపూర్ 21సెప్టెంబర్ ప్రజాధ్వని :స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని చారి ఆసుపత్రి వద్ద గల జై గణేష్ కురుమ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మంగళవారం కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుండి గణనాథుడికి ప్రత్యేక అలంకరణ చేసి, మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. వందలాది మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యను పూజించారు. భజనలు, కోలాటాలతో ఆ ప్రాంతమంతా భక్తిమయమైంది.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుంటి సాయిరాజ్, గుంటి శ్రీకాంత్, కామల్ల మహేష్, కామల్ల రవిశంకర్, చెట్కూరి లక్ష్మణ్, పారం నరేష్, గుంటి అశోక్, చెట్కూరి కుమార్, కామల్ల శ్రీను, పారం అనిల్, కామల్ల శంకర్, గుంటి యాదగిరి, గుంటి కుమార్, కామల్ల రాములు, కామల్ల కృష్ణ, కామల్ల పరమేష్, కామల్ల రాజ్ కుమార్, అమరాజి గట్టయ్య, కామల్ల రవి, కామల్ల రాజయ్య, కామల్ల శ్రీనివాస్ తదితర యూత్ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    మహిళల కుంకుమార్చనతో మార్మోగిన గణనాథుని మండపం - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: