కస్తూర్బాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు14 నవంబర్, 202604:37 PM
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాయపర్తి, నవంబర్ 14 (ప్రజాధ్వని): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, దేశభక్తి గీతాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బుర్ర కవిత మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు చిన్ననాటి నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

