యువజన సేవలకు గుర్తింపు.. నవీన్ యాదవ్‌కు ప్రశంసా పత్రం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు29 సెప్టెంబర్, 202601:15 PM

రాయపర్తి, సెప్టెంబర్ 29 ప్రజాధ్వని: యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతూ.. సన్మార్గంలో నడిపించేందుకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా దోమల నవీన్ యాదవ్‌కు అనుభవ, ప్రశంసా పత్రాలు లభించాయి. నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో నవీన్ యాదవ్ అందించిన సేవలను తెలంగాణ రాష్ట్ర యువజన, క్రీడల శాఖ డైరెక్టర్ చింతల అన్వేష్ అభినందించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సేవల్లో నవీన్ యాదవ్ అందించిన సేవలను గుర్తించిన డైరెక్టర్ చింతల అన్వేష్ ఆయనకు అనుభవ, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చింతల అన్వేష్ మాట్లాడుతూ.. యువతను సానుకూల దిశగా నడిపించడం, చెడు వ్యసనాలపై అవగాహన కల్పించడం, యువజన సంఘాలను ప్రోత్సహించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వాములను చేయడంలో నవీన్ యాదవ్ అనేక సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. యువత అభ్యున్నతికి ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో యువజన అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతలో నాయకత్వ లక్షణాల పెంపు, వ్యసనాల నివారణపై అవగాహన వంటి పలు కార్యక్రమాల్లో నవీన్ యాదవ్ చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నారు. అనుభవ, ప్రశంసా పత్రాలు అందుకున్న నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. యువత అభివృద్ధి, సమాజ సేవ కోసం భవిష్యత్‌లో మరింత బాధ్యతతో పనిచేస్తానన్నారు. తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేసిన డైరెక్టర్ చింతల అన్వేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి సంజీవ్, ఏపీవో దేవిలాల్, నూతన వాలంటీర్లు, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
