ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కార్మికుల సమస్యల పరిష్కారమే ఐఎన్‌టీయూసీ-327 లక్ష్యం

    • 73 ఏళ్లుగా కార్మికుల హక్కుల కోసం పోరాటం.. ఆవిర్భావ వేడుకల్లో రాజ్‌కుమార్
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు27 అక్టోబర్, 202603:49 AM

    కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ-327 యూనియన్‌ 73 ఏళ్లుగా సేవలందిస్తోందని ఐఎన్‌టీయూసీ జిల్లా సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొసాని రాజ్‌కుమార్‌ అన్నారు.

    కార్మికుల సమస్యల పరిష్కారమే ఐఎన్‌టీయూసీ-327 లక్ష్యం
    స్టేషన్‌ ఘన్‌పూర్‌, అక్టోబరు 26 (ప్రజాధ్వని): కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ-327 యూనియన్‌ 73 ఏళ్లుగా సేవలందిస్తోందని ఐఎన్‌టీయూసీ జిల్లా సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొసాని రాజ్‌కుమార్‌ అన్నారు. కార్మికులకు పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రత కల్పించే ఏకైక యూనియన్‌ టీఎస్‌ఈఈయూ-327 అని పేర్కొన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ పట్టణంలోని ఎన్‌పీడీసీఎల్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్న కార్మిక నేత స్వర్గీయ ఎస్‌.ఏ.ఎస్‌. కామేశ్వర్‌రావు విగ్రహం వద్ద సోమవారం యూనియన్‌ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్‌ పతాకాన్ని బొసాని రాజ్‌కుమార్‌ ఆవిష్కరించారు. డివిజన్‌ అధ్యక్షుడు వాసం శ్రీధర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అఖిల భారత ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు డాక్టర్‌ జి. సంజీవరెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌ ఆధ్వర్యంలో అనేక ఏళ్లుగా కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న యూనియన్‌ ఐఎన్‌టీయూసీ-327 అని కొనియాడారు. ఇటీవల నూతన కార్యవర్గం ఎన్నికైన కొద్దికాలంలోనే జనగామ, ఘన్‌పూర్‌ డివిజన్లలో కార్మిక సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. యూనియన్‌ సేవలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన పలువురు కార్మికులు ఈ సందర్భంగా నూతనంగా సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి. రాజు, అదనపు కార్యదర్శి జి. సుధాకర్‌, సంయుక్త కార్యదర్శి సతీష్‌, ట్రాన్స్‌కో ఉపాధ్యక్షుడు పి. మల్లేష్‌, ఘన్‌పూర్‌ డివిజన్‌ కార్యదర్శి మహమ్మద్‌ ఫయాజ్‌, సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి. సందీప్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు డి. సాంబరాజు, బి. శరత్‌, కోశాధికారి జి. కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు ప్రభాకర్‌, అర్చన, రమ్య, వెంకన్న, అదనపు కార్యదర్శి గిరి, కార్యాలయ కార్యదర్శి మహేందర్‌, మీడియా కన్వీనర్‌ అన్వర్‌ పాషా, సీనియర్‌ నాయకులు ఎస్‌. రవీందర్‌, ఎల్‌. రామాచారి తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: