ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ​ముందు మీ పార్టీ ఏదో చెప్పండి.. కడియంపై సౌడ రమేష్ ఫైర్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు20 ఏప్రిల్, 202603:32 PM
    ​ముందు మీ పార్టీ ఏదో చెప్పండి.. కడియంపై సౌడ రమేష్ ఫైర్
    జనగాం, ఏప్రిల్ 20 ప్రజాధ్వని : రాజకీయ లబ్ధి కోసం పదేపదే పార్టీలు మారుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ప్రస్తుతం తాను ఏ పార్టీలో ఉన్నారో ముందుగా స్పష్టం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఎద్దేవా చేశారు. సోమవారం జనగాం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో బీజేపీపై కడియం చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ కాలం నుండి నేటి రేవంత్ రెడ్డి వరకు కడియం ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని విమర్శించారు. మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎంపీ కడియం కావ్యపై రమేష్ మండిపడ్డారు. ఒక మహిళా ప్రతినిధిగా ఉండి మహిళా బిల్లును అడ్డుకోవడం బాధాకరమని, దీనికి ఆమె దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణాకు కేంద్రం ఏమీ చేయలేదని అంటున్న కడియంకు.. బీబీనగర్ ఎయిమ్స్, ములుగు గిరిజన వర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత్ రెడ్డి, లేగ రాంమోహన్ రెడ్డి, ఉడుగుల రమేష్, శతబోయిన శివరాజ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి, తోకల సంపత్ రెడ్డి, కాదుగాయ రమేష్, చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, జోగులు, ముక్కెర రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: