ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ అందజేసిన ఎమ్మెల్యే,ఎంపీ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 ఏప్రిల్, 202609:49 AM
    అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ అందజేసిన ఎమ్మెల్యే,ఎంపీ
    స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 8 ప్రజాధ్వని : అంగన్వాడీ వ్యవస్థను ఆధునికీకరించి, పిల్లల ఆరోగ్య పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, టీచర్లకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ… అంగన్వాడీ వ్యవస్థను డిజిటల్ వైపు తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ సులభమవుతుందని, పేపర్‌వర్క్ భారం తగ్గుతుందని తెలిపారు. మహిళల డిజిటల్ వినియోగాన్ని పెంచేందుకు ఇది కీలకమని చెప్పారు.
    అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ అందజేసిన ఎమ్మెల్యే,ఎంపీ  - అదనపు చిత్రం 1
    ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర కీలకమని అన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. నియోజకవర్గంలోని 108 అంగన్వాడీ కేంద్రాలకు నెల రోజుల్లో స్వంత భవనాలు మంజూరు చేసి, ఏడాది లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులలా అంగన్వాడీ టీచర్లు కూడా పిల్లలను చూసుకోవాలని, మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, హన్మకొండ, జనగామ డిడబ్ల్యుఓలు విశ్వజ, కోదండరాం, తహసీల్దార్, ఎంపీడివో, మున్సిపల్ కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: