ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    అభివృద్ధిని ఓర్వలేకే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తప్పుడు ప్రచారం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 ఆగస్టు, 202608:57 AM
    అభివృద్ధిని ఓర్వలేకే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తప్పుడు ప్రచారం
    స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆగష్టు 22 ప్రజాధ్వని: నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజు మండిపడ్డారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో ప్రస్తుతం నియోజకవర్గంలో వేగంగా జరుగుతోందని తెలిపారు. ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని రాజకీయ ప్రత్యర్థులు వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “అభివృద్ధి కనిపిస్తుంటే తప్పుడు ప్రచారం ఎందుకు?” అని ప్రశ్నించిన అంబటి కిషన్‌రాజు.. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎవరు అభివృద్ధి చేశారో.. ఎవరు అడ్డుకుంటున్నారో వారికి స్పష్టంగా తెలుసన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేస్తున్న అభివృద్ధి పనులపై విమర్శలు చేసే ముందు గతంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఎంతోకాలం మభ్యపెట్టలేరని, అభివృద్ధే తమకు సమాధానమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి సింగాపురం దయాకర్‌, గాదె అశోక్‌, సీనియర్‌ నాయకులు సింగాపురం ఎల్లయ్య, తిరుమలనాథ్‌ డైరెక్టర్‌ తాటికొండ యాదగిరి, బలగం వెంకటయ్య, సింగాపురం శివకృష్ణ, చింత భాస్కర్‌తో పాటు పలువురు యువజన నాయకులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: