ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యలను కలిసిన కొలిపాక సతీష్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు7 నవంబర్, 202601:33 PM
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలిపాక సతీష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

హన్మకొండ నవంబర్ 7 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలిపాక సతీష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ యాదవ్, నీల శ్రావణ్, శ్రీనివాస్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
