ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    కొండూరులో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

    • ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారి అలంకరణ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు15 అక్టోబర్, 202606:34 AM

    వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు అంబేద్కర్ విగ్రహం సమీపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి, ప్రతిరోజూ ఒక్కో అవతారంలో…

    కొండూరులో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
    రాయపర్తి, అక్టోబర్ 15 (ప్రజాధ్వని): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు అంబేద్కర్ విగ్రహం సమీపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి, ప్రతిరోజూ ఒక్కో అవతారంలో అలంకరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఐదో రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: