ఉత్తమ పొలిటికల్ లీడర్‌గా కొలిపాక సతీష్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు26 మే, 202612:40 PM

స్టేషన్ ఘనపూర్, మే 26 ప్రజాధ్వని :
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిపాక సతీష్‌కు “ఉత్తమ పొలిటికల్ లీడర్” అవార్డు లభించింది. హైదరాబాద్‌లో నాయీబ్రాహ్మణ జనసంస్థ ఆధ్వర్యంలో జరిగిన 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీసీఎం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ భారత ప్రభుత్వానికి చెందిన డాక్టర్ సారంగపాణి, కార్టూనిస్ట్ నారు, సుధాకర్, శ్రీధర్, ఓయూ రాజేశ్, ప్రొఫెసర్ సావిత్రి, దుర్గారాణి తదితరులు సతీష్‌ను ఘనంగా సన్మానించి శాలువా కప్పి మెమెంటో అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో నాయీబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కొలిపాక సతీష్ గత 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇదివరకే 2024లో తిరుపతిలో “జాతీయ సేవారత్న” అవార్డుతో పాటు సావిత్రిబాయి పూలే నాయీబ్రాహ్మణ సంస్థ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా హనుమకొండ సెలూన్ అసోసియేషన్ ద్వారా కూడా సత్కారం అందుకున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో సుశీల్, గోవిందరాజు, గోపాలకృష్ణ, సుబ్బయ్య, రమేష్, అశోక్ కుమార్, నవణిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
