ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు19 అక్టోబర్, 202610:17 AM

    దసరా పండుగను పురస్కరించుకుని ఫతేపూర్ గ్రామ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ ఊమ్ల నాయక్ గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..

    గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ
    చిల్పూర్ , అక్టోబర్ 19 (ప్రజాధ్వని): దసరా పండుగను పురస్కరించుకుని ఫతేపూర్ గ్రామ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ ఊమ్ల నాయక్ గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పండుగ సంతోషాలను వారితో పంచుకోవడంతో పాటు, వారి సేవలను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నూతన దుస్తులను పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధిలో సిబ్బంది కృషి ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: