ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువతి ధర్నా
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు5 అక్టోబర్, 202610:27 AM

వర్ధన్నపేట, అక్టోబర్ 5, ప్రజాధ్వని: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపిస్తూ వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి చిన్న కుమారుడు శ్రీకాంత్‌పై తుమ్మల శ్రీదేవి ఆరోపణలు చేసింది. సోమవారం చైర్మన్ ఇంటి ఎదుట కుల, మహిళా సంఘాలు, ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆమె ధర్నా చేపట్టింది. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం తర్వాత మోసం చేశాడని శ్రీదేవి ఆరోపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని శ్రీదేవి స్పష్టం చేసింది. అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ప్రజాప్రతినిధి కుమారుడిపై యువతి చేసిన ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై శ్రీకాంత్ లేదా ఆయన కుటుంబ సభ్యుల స్పందన తెలియాల్సి ఉంది.
