ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాట్లు
- హనుమాన్ ఆలయం వద్ద లైటింగ్ పనులను పరిశీలించిన సర్పంచ్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202603:53 PM

రాయపర్తి, అక్టోబర్ 10 ప్రజాధ్వని: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం గ్రామంలోని 1వ వార్డులో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద చేపడుతున్న లైటింగ్ ఏర్పాట్ల పనులను గ్రామ సర్పంచ్ బరిగల బాబు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి, పండుగ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మైస విక్రమ్, సిబ్బంది కుక్కల యాకయ్య, గ్రామస్తుడు దొంతరబోయిన రామదాసు తదితరులు పాల్గొన్నారు.
