శివునిపల్లిలో మార్మోగిన గణనామం.. భక్తితో పొంగిన మండపం!
- నాగేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంల కుంకుమ పూజలు
- వేలాదిగా తరలివచ్చిన మహిళలు
- నైవేద్యాలతో గణనాథుడికి నీరాజనం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202601:43 PM

స్టేషన్ ఘనపూర్ 21 సెప్టెంబర్ ప్రజాధ్వని: పట్టణంలోని శివునిపల్లి శివాలయంలో నాగేశ్వర స్వామి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో సోమవారం కుంకుమ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడికి కుంకుమార్చన చేసి, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళల భక్తి పాటలు, కోలాహలంతో మండపం మొత్తం భక్తిమయంగా మారింది. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
