ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కొండా సురేఖ భేటీ
- కాంగ్రెస్ బలోపేతంపై సచిన్ సావంత్‌తో కొండా సురేఖ చర్చలు
- సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం.. రాష్ట్ర రాజకీయ పరిణామాలపైనా సమాలోచన
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు25 అక్టోబర్, 202601:11 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మాజీ మంత్రి కొండా సురేఖ చర్చించారు.

హైదరాబాద్, అక్టోబరు 25 (ప్రజాధ్వని): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మాజీ మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఆదివారం సచిన్ సావంత్‌ను కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను మరింత క్రియాశీలం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా సుదీర్ఘంగా చర్చించారు.
