ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    ఘనంగా నవాడ ముత్తయ్య ముదిరాజ్ జయంతి వేడుకలు

    • 94వ దసరా సమ్మేళనం సందర్భంగా అలయ్‌–బలయ్‌.. ముదిరాజ్‌ భవన్‌లో సందడి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు25 అక్టోబర్, 202609:35 AM

    ముదిరాజ్‌ సామాజిక వర్గ అభ్యున్నతికి విశేష కృషి చేసిన ప్రముఖ నాయకుడు నవాడ ముత్తయ్య ముదిరాజ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 94వ దసరా సమ్మేళనాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌–బలయ్‌ కార్యక్రమంలో…

    ఘనంగా నవాడ ముత్తయ్య ముదిరాజ్ జయంతి వేడుకలు
    రాయపర్తి, అక్టోబరు 25 (ప్రజాధ్వని): ముదిరాజ్‌ సామాజిక వర్గ అభ్యున్నతికి విశేష కృషి చేసిన ప్రముఖ నాయకుడు నవాడ ముత్తయ్య ముదిరాజ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 94వ దసరా సమ్మేళనాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌–బలయ్‌ కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముదిరాజ్‌ సామాజిక వర్గ ప్రజల హక్కుల సాధన, సంఘటిత నిర్మాణం కోసం నవాడ ముత్తయ్య ముదిరాజ్‌ విశేషంగా కృషి చేశారు. హైదరాబాద్‌ మాజీ మేయర్‌ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌తో కలిసి 1992లో ముదిరాజ్‌ మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. సమాజ అభ్యున్నతికి, సామాజిక ఐక్యతకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల అనంతరం నిర్వహించే ఈ సమ్మేళనంలో భాగంగా సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిగూడ ముదిరాజ్‌ భవన్‌లో అలయ్‌–బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు నవాడ ముత్తయ్య ముదిరాజ్‌ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని సామాజిక ఐక్యతను చాటారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: