ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు8 నవంబర్, 202602:52 PM
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను జాఫర్‌గడ్ మండల కేంద్రంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికాయల రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

జాఫర్‌గడ్: నవంబర్ 8 ప్రజాధ్వని : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను జాఫర్‌గడ్ మండల కేంద్రంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికాయల రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వం కాంగ్రెస్ శ్రేణులకు, యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి యాకయ్య, మాజీ సర్పంచ్ బానోత్ లచ్చిరాం నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సముద్రాల సత్యనారాయణ, మండల నాయకులు కుల్ల రాజు, సముద్రాల రాజు, కాట కుమార్, మాజీ ఎంపీటీసీ రడపాక ఇంద్రయ్య, సిద్ధం లింగన్న, భూక్యా బాలాజీ నాయక్, భూక్యా అనిల్ నాయక్, సీహెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
