ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    శివునిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

    • వేడుకల్లో పాల్గొన్న 5వ వార్డు కౌన్సిలర్ రమ్యా రఘు రెడ్డి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202601:25 PM
    శివునిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
    స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 10 (ప్రజాధ్వని): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు శివునిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఘనంగా జరిగాయి. వార్డుకు చెందిన మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పండుగ వాతావరణంతో వార్డులో సందడి నెలకొంది. ఈ వేడుకల్లో 5వ వార్డు కౌన్సిలర్ రమ్యా రఘు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    శివునిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 1
    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. పండుగలను ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 5వ వార్డుకు చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
    శివునిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: