ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    జిల్లా వార్తలు

    విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు23 సెప్టెంబర్, 202605:50 AM
    విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలి
    హనుమకొండ, సెప్టెంబర్‌ 23 ప్రజాధ్వని: కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుంకరి జ్యోతిని విధుల నుంచి తొలగించాలని స్వేరో స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎస్‌ఎస్‌యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కళాశాల వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్‌ వ్యవహారశైలితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరినప్పుడు.. తాను మహిళా ప్రిన్సిపాల్‌నంటూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సాయికుమార్‌ ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), ప్రొఫెషనల్‌, నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు సరైన సమాచారం ఇవ్వకుండా గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ విద్యార్థులను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ సమయపాలన పాటించడం లేదని, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులకు కనీస మర్యాద ఇవ్వడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విద్యకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన సాయికుమార్‌.. ప్రిన్సిపాల్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌యూ నాయకులు శివకుమార్‌, రాజ్‌కుమార్‌, అభిలాష్‌, నాగరాజు, బంటి, సుఖేష్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.
    విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలి - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: