భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు15 ఆగస్టు, 202611:41 AM

స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 15 ప్రజాధ్వని : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేషన్‌ఘన్‌పూర్‌లో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 1వ వార్డు కౌన్సిలర్, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి తాటికొండ మధు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తాటికొండ మధు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభివృద్ధిలో భవన నిర్మాణ రంగ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు బీమా, ఆరోగ్య కార్డులు, వారి పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని మధు తెలిపారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కలకోల ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి తాడికొండ బాలకృష్ణ, సహాయ కార్యదర్శి చింత లింగయ్య, జిల్లా నాయకులు చింత శ్రీనివాస్, చింత జోజి తదితరులతో పాటు భవన నిర్మాణ రంగ కార్మికులు, సంఘ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
