ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఐక్యతతో ముందుకు సాగాలని BNRKS సమావేశంలో పిలుపు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202604:58 AM
    ఐక్యతతో ముందుకు సాగాలని BNRKS సమావేశంలో పిలుపు
    స్టేషన్ ఘన్‌పూర్ 21సెప్టెంబర్ ప్రజాధ్వని :భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం (BNRKS) ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్‌పూర్ లోని ZPHS గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా BNRKS రాష్ట్ర కోశాధికారి తాటికొండ మధు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, హక్కులు, సంక్షేమంపై ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలన్న, రాష్ట్ర కోశాధికారి, ఘన్‌పూర్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ తాటికొండ మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురుగు యాదగిరి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేములకొండ సంపత్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సూర వెంకన్న, జనగామ జిల్లా అధ్యక్షుడు వాతల యాదగిరి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు రాజేందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మూల వీర నరసింహులు, స్టేషన్ ఘనపూర్ మండల ఉపాధ్యక్షుడు కలకోల ఎల్లయ్య కార్యదర్శి, మండల కార్యదర్శి తాటికొండ బాలకృష్ణ, సహాయ కార్యదర్శి చింత లింగయ్య, శ్రీనివాస్,సంఘం నాయకులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: