ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    కామ్రేడ్ పెసర నారాయణ మృతి.. సీపీఐ నాయకుల నివాళి

    • పార్టీకి తీరని లోటు.. ఆయన సేవలు మరువలేనివి: సీపీఐ నాయకులు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 నవంబర్, 202611:52 AM

    హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాళ్లతాటికాల గ్రామానికి చెందిన సీపీఐ గ్రామ శాఖ కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెసర నారాయణ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు.

    కామ్రేడ్ పెసర నారాయణ మృతి.. సీపీఐ నాయకుల నివాళి
    ధర్మసాగర్ నవంబర్ 5 ప్రజాధ్వని: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన సీపీఐ గ్రామ శాఖ కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెసర నారాయణ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న ధర్మసాగర్ మండల సీపీఐ కోశాధికారి, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజారపు రత్నం, మండల సీనియర్ నాయకుడు డోకి రాజన్న తదితరులు గ్రామానికి చేరుకుని నారాయణ పార్థివదేహంపై పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కామ్రేడ్ పెసర నారాయణ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. జీవితాంతం సీపీఐ సిద్ధాంతాలకు కట్టుబడి, ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా పార్టీ ఆశయాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నారాయణకు కుమారుడు యాదగిరితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల రాజయ్య, రాజారపు శీను, పిట్టల వీరయ్య, నీల ఎల్లయ్య, సాంబరాజు, కొమురయ్య, కొండబోయిన పాపయ్య, పెసర లక్ష్మయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: