ముంబై తడబాటు… టాప్ ఆర్డర్ కుప్పకూలింది!
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 ఏప్రిల్, 202610:59 AM

ఐపీఎల్ పోరులో టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోయిన ముంబై… మధ్య ఓవర్లలో కూడా కోలుకోలేకపోతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (35) కొంత పోరాడినా… మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రికెల్టన్ (9), తిలక్ వర్మ (0) త్వరగా పెవిలియన్ చేరడంతో స్కోర్‌బోర్డ్‌పై ఒత్తిడి పెరిగింది. 10 ఓవర్లు ముగిసేసరికి 73 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ముంబై ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (27*) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుండగా… మరోవైపు రూథర్ఫర్డ్ (1*) తోడుగా ఉన్నాడు. ఇక్కడి నుంచి పెద్ద భాగస్వామ్యం కట్టగలిగితేనే ముంబై పోటీలో నిలబడే అవకాశం ఉంది. లేదంటే మరోసారి తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
