ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలి: బీజేపీ

    • ఎల్‌-1 జాబితాలోని పేదలకు ఇళ్లు కేటాయించాలి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు30 సెప్టెంబర్, 202606:37 AM
    ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలి: బీజేపీ
    రఘునాథపల్లి సెప్టెంబర్ 30 ప్రజాధ్వని: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని బీజేపీ రఘునాథపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఎల్‌-1 జాబితాలో ఉన్న అర్హులైన కుటుంబాలను పరిగణనలోకి తీసుకుని ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ ప్రాధాన్యతకు చోటు కల్పిస్తున్నారంటూ కొంతమంది బాధితులు చేస్తున్న ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని రంజిత్‌ యాదవ్‌ కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన ఇళ్లను కేటాయించాలని అన్నారు. కొంతమంది సర్పంచులు తమకు ఇష్టమైన రాజకీయ పార్టీకి చెందిన వారు కాదనే కారణంతో ఇళ్లు ఇవ్వబోమని చెప్పినట్లు బాధితులు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికారులు వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను అవసరమైన సమయంలో అధికారుల ముందుంచుతామని తెలిపారు. ఎల్‌-1 జాబితాలోని అర్హులైన కుటుంబాలను గుర్తించి, ఇళ్ల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకత పాటించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తక్షణమే స్పందించకపోతే రఘునాథపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో పాటు కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని రంజిత్‌ యాదవ్‌ హెచ్చరించారు. పేదల హక్కుల కోసం న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: