అనిత ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు16 ఆగస్టు, 202603:26 AM

స్టేషన్‌ఘనపూర్ ఆగష్టు 15 ప్రజాధ్వని : మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో అనిత ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో యాజమాన్యం, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ జీడి అనిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జీడి అనిత మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన రోజు స్వాతంత్ర్య దినోత్సవమన్నారు. అనిత ఎంటర్‌ప్రైజెస్ ఎల్లప్పుడూ దేశ అభివృద్ధితో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తుందని తెలిపారు. సంస్థ ఉద్యోగులు దేశభక్తి, నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
