తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలమే రాష్ట్రం: ఎమ్మెల్యే గండ్ర
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 జూన్, 202604:06 AM

భూపాలపల్లి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేక మంది అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల నిరంతర పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
