ఆర్‌టీఐ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు9 ఏప్రిల్, 202604:38 AM

చిల్పూర్ ఏప్రిల్ 09 ప్రజాధ్వని : చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఆర్‌టీఐ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాజవరం ప్రభుత్వ హైస్కూల్‌లో పరీక్ష ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొత్తం 90 పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌టీఐ లీగల్ సెల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గద్దె అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. విద్యకు అవసరమైన సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ బ్లాక్ ప్రెసిడెంట్ డేవిడ్, కొమురయ్య, ఆకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం నిర్వహించినందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
